Creative తెలుగు కవితలు

ఈశ్వరార్పణం 

ఏముంది  ఏముంది నాకు ఉన్నది అంతా నీదే 
ఏముంది  ఏముంది నాకు ఉన్నది అంతా నీదే బాబా

తనువునిచ్చింది నీవు దానికి తిండినిచ్చింది నీవే
మనసునిచ్చింది నీవు దానికి ఆలోచనిచ్చింది నీవే 
ధనమునిచ్చింది నీవు దానికి లెక్కనిచ్చింది నీవే బాబా     ||ఏముంది||


సంబందాలనిచ్చింది నీవు అందులో ప్రేమ నింపింది నీవే
వ్యాపారం నేర్పింది నీవు లాభాలనిచ్చింది నీవే
సమయమునిచ్చింది నీవు సంయమనమును నేర్పింది నీవే  ||ఏముంది||

తీసుకో తీసుకో బాబా ఈ సంబంధాలు నాకెలా బాబా 
తీసుకో తీసుకో బాబా ఈ శరీరము నాకెందుకు బాబా

తీసుకో తీసుకో బాబా ఈ మనస్సు నాకొద్దు బాబా    ||ఏముంది||

                                                                                               ---అంతా ఆ భగవంతునిదే

జీవితం

తిండీ - నిద్రా! మూడోదేది లేదా!
ఆటా - పాటా ! ఇంతేనా జీవితగాథ!
వాట్సాప్పూ - ఫేస్బుక్కూ ! నీ బతుకు అడుక్కూ!
మానవా! ఇక మాన వా!
మేలుకో ఇక కోలుకో!
నివ్వెవరివో తెలుసోకో - నీ శిల్పం మలచుకో!
ఆత్మజ్ఞానం తెలుసుకో - ఆత్మానందం పొందుకో!
పరమాత్మను తెలుసుకో - పరమానందం పొందుకో!

                                                                              --- భగవంతుని ప్రేరణతో 

పరివర్తన 

మనిషి గా పుట్టి చదువులేమో చదివి
ఆత్మ జ్ఞానం తెలియద మీకూ!
కడుపు నిండ తింటూ కంటి నిండ నిద్ర పోతూ
పరమాత్మ ఎవరో తెలియద మీకూ!
సూటు బూటు వేసి మేడ మీద మేడ కట్టి
 డ్రామా జ్ఞానం తెలియద మీకూ!
మమ్మీ డాడీ లంటూ టీవి ఫోన్లు 
వాడుతూ
సత్య మాతాపితలు తెలియద మీకూ!
బుద్ధివంతులం అంటూ గొప్పలేమో చెబుతూ
మన్బుద్ధి ని నియంత్రించక రాదా.
                                                                    
                                                                                          --- భగవంతుని ఆశీస్సులతో

సంతృప్తి

ఇంకేం కావాలి మాకు- ఇంకేం రావాలి బాబా.2
క్షణ దర్శనం కోసం తపించే మాకు జత లో ఉంటున్నావు.
ఇంకేం కావాలి మాకు- ఇంకేం రావాలి బాబా.
ఊహించనైనా లేదు మేము స్వర్గం లోకి వెళ్తామని మరియు
దేవతలుగా అవుతామని.
ఇంకేం కావాలి మాకు- ఇంకేం రావాలి బాబా.
అర్థం లేని ఈ జీవితాన్ని సమర్థంగా చేసావు.
ఇంకేం కావాలి మాకు- ఇంకేం రావాలి బాబా.
చెల్లు గాని 5 పైసలు తీసుకొని
 సం: లకు సంపన్నం గా చేస్తున్నావు.
ఇంకేం కావాలి మాకు- ఇంకేం రావాలి బాబా.

                                                                                              ---పరమాత్ముని ఆదరణతో

సాహసం 

తలదించని  ధీరుడను - మెడవంచని సైనికుడను
వెనుతిప్పని నాయకుడను - మాటతప్పని మనుజుడను
అడుగేస్తా - అడుగేస్తా - మున్ముందుకే అడుగేస్తా
చావనైనా చస్తాగాని - అడుగుమాత్రం వెనెక్కేయను
పరమాత్ముని ఆశీస్సులతో - పరివార శుభాకాంక్షలతో
జీవితాన్ని దారపోస్తా - అంతేగాని వెనెక్కు వెళ్ల
కష్టమైన, నష్టమైనా ప్రతిజ్ఞనైతే వదలబోను
చావైనా, రేవైనా -- సామర్థంతో ఎదుర్కుంటా
ప్రయత్నిస్తా, ప్రయత్నిస్తా - చివరి వరకూ నే ప్రయత్నిస్తా
ఆలసిపోను, సొలసిపోను - విజయము వచ్చేదాకా విశ్రమించబోను.

                                                                                               ---పరమాత్మకిది అంకితం

నాది నీది లోకి పరివర్తన

ఏముంది  ఏముంది నాకు ఉన్నది అంతా నీదే 
ఏముంది  ఏముంది నాకు ఉన్నది అంతా నీదే బాబా

తనువునిచ్చింది నీవు దానికి తిండినిచ్చింది నీవే
మనసునిచ్చింది నీవు దానికి ఆలోచనిచ్చింది నీవే 
ధనమునిచ్చింది నీవు దానికి లెక్కనిచ్చింది నీవే బాబా     ||ఏముంది||

సంబందాలనిచ్చింది నీవు అందులో ప్రేమ నింపింది నీవే

భగవంతుని బహు నామాలు

1.   శివ
2.   ఈశ్వరుడు
3.   సత్యం
4.   సుందరం
5.   అమరనాథుడు
6.   విశ్వనాథుడు
7.   సోమనాథుడు
8.   మంజునాథుడు
9.   పశుపతినాథుడు
10.  కేదారనాథుడు
11.  బబులనాథుడు
12.  రామేశ్వరుడు
13.మహా కాలెశ్వరుడు
14. లోకేశ్వరుడు
15. ఘ్రుష్నేశ్వరుడు
16. ఉమామహేశ్వరుడు
17.   త్రయంబకేశ్వరుడు
18.  మునీశ్వరుడు
19. కాలహస్తీశ్వరుడు
20.అగస్తేశ్వరుడు
21.గోపేశ్వరుడు
22. పులిచర్మాంబధరుడు
23. నీలకంటుడు
24.నందివాహనుడు
25.నాగబరణుడు
26.సాంబశివుడు
27.మల్లికార్జునుడు
28. గంగాధరుడు
29.జటాధరుడు
30. త్రిశూలధారుడు
31.చంద్రశేఖరుడు
32.నటరాజు
33.అర్ధనారీశ్వరుడు
34. మహాదేవుడు
35.హరుడు
36. రుద్రుడు
37. వీరభద్రుడు
38. నాగలింగెశ్వరుడు
39.రామలింగేశ్వరుడు
40.  జ్ఞానలింగేశ్వరుడు
41. వాయులింగేశ్వరుడు
42.పంచలింగెశ్వరుడు
43.భూతనాథుడు
44.కైలాసనాథుడు
45. గౌరీనాథుడు
46. సతీనాథుడు
47.భువనేశ్వరుడు
48.మహేశ్వరుడు
49.కోటప్ప
50.గురప్ప
51.ఆదిదేవుడు
52. జెహోవా
53.అల్లా
54. యెహోవా
55.గాడ్ ఫాదర్
56.ఏక్ ఓంకార్
57.ఓంకారేశ్వరుడు
58.సంగ్-ఏ-అస్వద్
59.జగదీశ్వరుడు
60.వజ్రలింగేశ్వరుడు
61.భైరవుడు
62. ముక్తేశ్వరుడు
63.మొక్షేస్వరుడు
64.మహా కాలుడు
65. జ్యోతీశ్వరుడు
66.జ్యోతిర్లింగం
67.ధర్మరాజు
68.భోళానాథుడు
69. ప్రకృతి పతి
70.అరుణా చలేశ్వరుడు
71.యోగెశ్వరుడు
72. కపాలనాథుడు
73.స్మశానవాసి
74. విభూతినాథుడు
75. పరంధాముడు


పాట 1

బాబా నా బాబా భాగ్యం మాదేగా
తల్లి తండ్రి  నీవే గురువు నీవే గా
చుట్టూ లోకం నీవే చుట్టం నీవే గా
మూసిన కనులె తెరిపించి చీకటి దారే వెలిగించి
ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి
అండగా మా కర్మలనే ప్రక్షాళననే చేయించి
నీ మార్గంలో పయనించి నిన్నే మేమికా ప్రేమించి
సేవే చేసే భాగ్యం ఇచ్చావు                                                   
                                                                             "బాబా నా - భాగ్యం మాదేగా"
విలువైన జ్ఞానం నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు
పదిమంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేశావు
ప్రతి హృదయం లో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు  బాబా
జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే సృహ పెంచి
ప్రేమిస్తే అధిపొందే జ్ఞానమునే వెలిగించి
క్రమ శిక్షణలో మమ్ముంచి సద్భావనే పుట్టించి
సత్సంగాన్నే స్థాపించావు బాబా                                                                
                                                                             "బాబా నా - భాగ్యం మాదేగా"
పరులన్న భావం నాదన్న మోహం తరిమేసే గుణమిచ్చి
అనునిత్యం కర్మం గృహస్తు ధర్మం పాటించే వరమిచ్చి
ప్రతి సంకల్పంలో నీరూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా
 ప్రతి నిమిషం గత కర్మ తుడిచేసే దారిచ్చి
చేదు భావం ఎదురైతే తెలుసుకొనే బలమిచ్చి
నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి
మా ఆత్మలలో తేజం నింపావు 
                                                                     "బాబా నా - భాగ్యం మాదేగా"


పాట 2


ఏ  ప్రాణమూ దేహమూ  ఆత్మ లేక లేదు గా
ఏ పాశమూ  బంధమూ ఆత్మ లేక రాదు గా

పోయే జన్మల మిగిలే కర్మకు ఉంటుందీ  ఫలితం
మంచి చెడ్డల నుంచే ఆత్మకు మళ్ళీ ఓ జననం
ఈ ఆత్మేగా సత్యం ఈ ఆత్మేగా సర్వం
శరీర మన్న మాట మాయరా ఆ ....  
                                                                                                  "ఏ ప్రాణము-రాదు గా"
ఈ ఆత్మకు ఉండే రూపం చిరు బిందువుగా
ఆ ఆత్మకు తీయని బంధం పరమాత్ముడుగా
ఆత్మకున్న శక్తులు మూడు మూర్తులూ
చేసుకుంటే నీవశం నీదే ముక్తి మార్గము....               
                                                                                                   "ఏ ప్రాణము-రాదు గా"
నువ్వు ఏమని అనుకుంటావో జరిగేను సుమా !
చెడుగానువు ఆలోచిస్తే అది ఏ కర్మ
చేసుకుంటే ధ్యానం ఆత్మ జ్ఞానము
జ్ఞానమున్న ఆత్మకే పరంధామ దర్శనం ....                          
                                                                                                   "ఏ ప్రాణము-రాదు గా"


అమ్మ చెప్పిన సామెతలు

1.రోకలి ఎత్తి దంచలేవు, అన్నామేమో ఆకలి అవుతోంది.


Comments